సినిమా
Ajith: అజిత్ ఎమోషనల్ జర్నీ!

Ajith: తమిళ స్టార్ అజిత్ కుమార్ సినీ జర్నీలో 33 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఎన్నో సవాళ్లు, ఒత్తిడిలు ఎదుర్కొన్నానని, పట్టుదలతో ఈ స్థాయికి చేరానని తెలిపారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు.
తమిళ స్టార్ అజిత్ కుమార్ సినీ రంగంలో 33 ఏళ్ల జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణం సులభం కాదని, ఎన్నో సవాళ్లు, మానసిక ఒత్తిడిలు, వైఫల్యాలు ఎదుర్కొన్నానని తెలిపారు.
సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి, బయటి వ్యక్తిగా ఈ స్థాయికి చేరానని, పట్టుదలే తన బలమని ఆయన చెప్పుకొచ్చారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక మైలురాయిగా భావిస్తూ, మరిన్ని విజయాల కోసం ఎదురుచూస్తున్నానని అజిత్ పేర్కొన్నారు. అజిత్ జర్నీ అభిమానులను ఆకట్టుకుంటోంది.



