తెలంగాణ
హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని రైలు బ్రిడ్జి కింద వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



