ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. మ్యాచ్‌ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 2 వేల 700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్న సీపీ 300 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్‌లో 1,218 మంది, 12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
అంతేకాకుండా ఉప్పల్ స్టేడియంలో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏసీపీ సారథ్యంలో భద్రతను పర్యవేక్షించనున్నట్లుగా తెలిపారు. ఇక స్టేడియం ఎంట్రన్స్ వద్ద స్నిపర్ డాగ్స్, బాంబ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు. అభిమానుల కోసం స్పెషల్ గా ఐదు చోట్ల పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు.



