ఆంధ్ర ప్రదేశ్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో, కృష్ణా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.



