ఆంధ్ర ప్రదేశ్
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు.. రాకపోకలకు అంతరాయం

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దోర్నాల మండలంలోని నల్లమల అభయారణ్యంలో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. గంటవానిపల్లి ప్రధాన రహదారిపై తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో గ్రామస్తులు, ప్రత్యేకించి గర్భిణీలు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే సమస్య కొనసాగుతోందని, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.



