తెలంగాణ
ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి నీరు చేరింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. శివంపేట మండలం పోతుల బొగుడ సమీపంలో భారీ వరదకు కొట్టుకుపోయిన ఉసిరికపల్లి-వెల్దుర్తి రోడ్డు కొట్టుకుపోయింది.
పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.



