ఆంధ్ర ప్రదేశ్
Cyclone Montha Effect: మచిలీపట్నంలో భారీ వర్షాలు

Cyclone Montha Effect: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వీస్తున్న ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. మంగినపూడి బీచ్‌కి వెళ్లే రోడ్డులో రెండు మూడు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి.దీంతో కొంత మేర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలోనే వాటిని తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు. తుపాన్ తీవ్రత పెరడంతో మచిలీపట్నంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈదురు గాలుల ప్రభావంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.



