ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో భారీ వర్షాలు

ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి విశాఖపట్నంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వాహనదారులు సహా స్కూల్ కు వెళ్లే విద్యార్థులు ఇతరులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు అక్కయపాలెం, కంచపాలెం, మద్దిలపాలెం ప్రాంతాలు లో భారీ వర్షం కురిసింది.



