తెలంగాణ
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొట్టింది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులతో కూడిన వాన పడటంతో వృక్షాలు నేలకొరిగాయి.
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీఎచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.



