తెలంగాణ
తెలంగాణలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

Rain Alert: తెలంగాణలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒరిస్సా తీరం వెంబడి అల్పపీడనం తీరం దాటింది. జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలులు కామరెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలపై ప్రభావం చూపించాయి.. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కామారెడ్డిలో 48 గంటల్లో 60 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.



