తెలంగాణ
మెదక్ జిల్లాలో భారీ వర్షాలు

మెదక్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో మూడున్నర గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడింది. దీంతో మెదక్ పట్టణంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరింది.
మెదక్ పట్టణంలోని గాంధీ నగర్ కాలనీని వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. అటు మెదక్ , హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ ని తొలగిస్తున్నారు అధికారు



