తెలంగాణ

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Heavy Rain: హైద‌రాబాద్‌లో మొద‌లైన వ‌ర్షం.. సాయంత్రానికి దంచికొట్ట‌నున్న వాన‌..!భాగ్యనగరంలో మళ్లీ వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, హైటెక్‌ సిటీ, ఐకియా సెంటర్‌, మాదాపూర్‌, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, అమీర్‌పేట సహ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button