తెలంగాణ
Heavy Rain: హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టుప్రాంతాలు జలమయం

తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌ను హైడ్రా సిద్ధం చేసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలతోపాటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురవనున్నాయి. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
ఇక హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.