తెలంగాణ
హైదరాబాద్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన

Rain: హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతుంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్టతోపాటు కూకట్ పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో వర్షం పడుతోంది. వాన కురుస్తుండటంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.