తెలంగాణ
ఆసిఫాబాద్ లో భారీ వర్షం.. పొంగి పొర్లుతున్న వాగులు

ఆసిఫాబాద్ జిల్లాలోని భారీ వర్షాలతో వాగులు పొంగిపోర్లుతున్నాయి. అనర్‌పల్లి వాగుకు భారీగా వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయారు. అనర్‌పల్లి వాగు బ్రిడ్జి నిర్మాణంలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అంటున్న గ్రామస్తులు.