ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో ఎడతెరిపి లేని వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత ఉధృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button