ఆంధ్ర ప్రదేశ్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Weather Report: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో బుధ, గురువారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.



