ఆంధ్ర ప్రదేశ్
సుంకేసుల డ్యామ్ కు భారీగా వరద నీరు

కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాంకు జలకల సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో ఇన్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండడంతో నీటిని దిగువకు శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1.20 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 0. 85 టీఎంసీలు ఉందని అధికారులు తెలిపారు.