తెలంగాణ
కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగు తున్నది. కాళేశ్వరంలోని సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జ్ఞాన జ్యోతులు నీట మునిగాయి. ఇక్కడ నది గరిష్ఠ ప్రవాహం 13.460 మీటర్లు కాగా, ప్రస్తుతం 12.210 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, గొర్రెలు, పశువుల కాపరులు, మత్య్సకారులు నదిలోకి వెళ్లొద్దని సూచించారు. గోదావరి వరద ప్రవాహం మేడిగడ్డ వైపు ఉరకలేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ నిండుకుండలా మారింది.



