ఆంధ్ర ప్రదేశ్
ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు వరద నీరు

కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో 15 వేల క్యూ సెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. వరదనీరు ఉధృతికి పిఠాపురం నియోజకవర్గంలో చాలా చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో సుమారు 10వేల ఎకరాలు ముంపుకు గురయ్యాయి. పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. అయితే గండ్లు పడినచోట రైతులు లే ఇసుక బస్తాలు వేసుకుంటున్నారు.



