తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 22 గేట్లను 5 అడుగులు 4 గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి 2 లక్షల 7 వేల 720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2 లక్షల 2 వేల 531 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 2 లక్షల 54 వేల 600 క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 585.20 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 298 టీఎంసీలు ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.