తెలంగాణ
హైదరాబాద్‌కు మూసీ వరద ప్రమాదం

Hyderabad: హైదరాబాద్‌ను మూసీ ముంచెత్తే ప్రమాదం ఉంది. మరో రెండు మూడు రోజులు వరుసగా వర్షాలు పడితే మూసీ ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో చాదర్‌ఘాట్ సహా శంకర్ నగర్, మలక్‌పేట్ పరిసరాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కాగా హిమాయత్ సాగర్ 8 గేట్లు ఎత్తారు అధికారులు. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మూడు ఫీట్ల వరకు గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి విడుదల చేశారు.



