తెలంగాణ
Yadadri: ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ..రాకపోకలు బంద్

Yadadri: ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి నీటిని విడుదల చేయడంతో మూసీ ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది.వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్దగల లోలెవల్ బ్రిడ్జి మీద నుంచి రాకపోకలను నిలిపివేశారు.
ఎగువన కుండపోత వర్షాలు కురవడం వలన నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రమాదకర స్థాయిలో మూసి ప్రవహిస్తున్నందున, నది సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.



