ఆంధ్ర ప్రదేశ్
Dastagiri: జైల్లో దస్తగిరికి బెదిరింపులపై నేడు విచారణ

Dastagiri: కడప జైల్లో దస్తగిరికి బెదిరింపులపై నేడు విచారణ షురూ కానుంది. వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరిని జైల్లో బెదిరింపులకు గురిచేసిన ఘటనపై ఎంక్వైరీని వేగవంతం చేయనున్నారు. కాసేపట్లో దస్తగిరి విచారణకు హాజరుకానుండగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ క్వశ్చన్ చేయనున్నారు.
అనంతరం జైలు వార్డెన్స్, సిబ్బందిపై కూ డా ప్రశ్నలవర్షం కురిపించనున్నారు. రెండ్రోజులపాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇక దస్తగిరి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.