ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: నేడు వంశీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ

Vallabhaneni Vamsi: నేడు వల్లభనేని వంశీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగనుంది. రెండు పిటిషన్లపై విజయవాడ ఎస్సీ-ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారించనుంది. కాగా ఇప్పటికే వంశీని రెండో సారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే కస్టడీకి ఇవ్వొద్దని వంశీ తరపు న్యాయవాదుల కౌంటర్ దాఖలు చేశారు.
బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాలు వాదనలు వినిపించ గా సాక్షాలను తారుమారు చేస్తారు, బెయిల్ ఇవ్వొద్దన్న పీపీ వాదించారు. వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.. బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరుపు న్యాయ వాదులు కోర్టును కోరారు. అయితే ఇవాళ మరోసారి బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్నారు ఇరువైపులా న్యాయవాదులు.