తెలంగాణ
Harish Rao: అందాల పోటీలు ఏమైనా కడుపు నింపుతాయ?

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని హరీష్‌రావు మండిపడ్డారు. అందాల పోటీలు ఏమైనా కడుపు నింపుతాయ అని ప్రశ్నించారు. ధాన్యం కుప్పలపై ఐదుగురు రైతులు చనిపోయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. సీసీఐలో అధికారుల వల్ల 3వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్‌రావు ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు.