సినిమా
శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రంలో హరీష్ శంకర్ ప్రత్యేక పూజలు

కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రాన్ని, పాదగయ క్షేత్రాన్ని దర్శకుడు హరి శంకర్ సందర్శించారు. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల సందర్భంగా రాజరాజేశ్వరి ఉమా కుక్కటేశ్వర స్వామి, పురోహితిక అమ్మవారిని, శ్రీపాద శ్రీ వల్లభుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులు కోరుకునే విధంగా అన్ని అంశాలు ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉంటాయని తెలిపిన దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు.



