సినిమా
Harish Rao: లండన్‌లో అంబేద్కర్ హౌస్‌ను సందర్శించిన హరీశ్‌రావు

Harish Rao: లండన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. లండన్‌లోని కింగ్ హెన్రీస్ రోడ్‌లో నాడు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నివసించిన ఇంటిని హరీష్ రావు సందర్శించారు. అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ వారసత్వం, దార్శనికతను గౌరవిస్తూ సందర్శకుల పుస్తకంలో సందేశాన్ని రాశారు.
అంబేద్కర్ ప్రవచించిన సమానత్వం, న్యాయం, సాధికారత ఆదర్శాలు సమ్మిళిత భారతదేశం, న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆ వివరాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.



