తెలంగాణ

Harish Roa: కేసీఆర్ హిందువుల, ముస్లిం అభ్యున్నతి కోసం పాటుపడ్డారు

Harish Roa: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ హిందువుల, ముస్లిం అభ్యున్నతి కోసం పాటుపడ్డారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాలు అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మతాలకు అతీతంగా ఉగాది, రంజాన్ పండుగలను హిందూ ముస్లింలు సోదరభావంతో జరుపుకోవడం శుభపరిణామం అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button