తెలంగాణ
మంత్రి ఉత్తమ్కుమార్కు మాజీ మంత్రి హరీష్రావు లేఖ

మంత్రి ఉత్తమ్కుమార్కు మాజీ మంత్రి హరీష్రావు లేఖ రాశారు. సాగు నీళ్లకోసం రైతుల ఎదురుచూస్తున్నారని అన్నారు. వరి నాట్లు వేసిన రైతులకు న్యాయం చేయాలని హరీష్రావు కోరారు. యాసంగి పంటకు నీళ్లు వస్తాయా రావా అనే ఆందోళనలో ఉమ్మడి జిల్లా రైతులు ఉన్నారని అన్నారు. యాసంగి పంటకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలన్నారు. తక్షణమే నీటి విడుదల చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.



