తెలంగాణ
మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్‌కు తరలింపు..

Harish Rao: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాసేపట్లో ఆసుపత్రిని నుండి డిశ్చార్ కానున్నారు. ప్రస్తుతం హరీష్ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జ్వరంతో బాధ పడుతున్న ఆయన నిన్న సాయంత్రం 7గంటలకు బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. జనరల్ ఫిజిషియన్, ఇంటర్నల్ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ పాటిల్ సుదేశ్ వైద్య పరీ క్షలు నిర్వహించిన తర్వాత ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని హరీశ్ రావుకు సూచించారు.
దీంతో ఆసుపత్రిలో చేరిన హరీష్ రావుకు చికిత్స కొనసాగింది. ఇక వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్న హరీశ్ రావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు హరీష్ రావును కేటీఆర్, పార్టీ నేతలు పరామర్శించారు.