తెలంగాణ
Harish Rao: ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ తెచ్చిన కరువు

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ తెచ్చిన కరువని ఆయన మండిపడ్డారు. రేవంత్‌కు పాలన చేతకాక ప్రకృతిపైనా, ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు.
కృష్ణా నదిలో రేవంత్ గురువు చంద్రబాబు నీళ్లు దోచుకుంటుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదన్నారు. బాబును ప్రశ్నించే దమ్ము రేవంత్‌కు లేదన్నారు. బాబుకు రేవంత్‌రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని హరీష్‌రావు ధ్వజమెత్తారు.