తెలంగాణ
Harish Rao: రేవంత్ చేస్తోంది తెలంగాణ రైజింగ్ కాదు.. తెలంగాణ ఫాలింగ్

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఫైరయ్యారు. రేవంత్ చేస్తోంది తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ ఫాలింగ్ అని విమర్శించారు హరీశ్ రావు. బీఆర్ఎస్ హయాంలో GST కలెక్షన్ వృద్ధి రేటు ఎప్పుడూ 6% కంటే ఎక్కువే నమోదు అయ్యేదన్నారు.
రేవంత్ పాలనలో ఒక్క శాతం మాత్రమే నమోదు చేసిందన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ పాలనలో ప్రజల కొనుగోలు తగ్గిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. హైడ్రా, మూసీ లాంటి తలా,తోక లేని నిర్ణయాలు, అనాలోచిత చర్యలతో ఆగష్టు 2024 తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు.
GST ఆదాయంలో తక్కువ వృద్ధి రేటు, రిజిస్ట్రేషన్లు, వెహికిల్ టాక్స్ లో నెగెటివ్ వృద్ధి రేటు రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాన్ని ఎండ గడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పి పాలన పై శ్రద్ధ వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.