తెలంగాణ
Harish Rao: రేవంత్ అసెంబ్లీని బూతులమయం చేశారు

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైరయ్యారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని హరీష్‌రావు విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.
రేవంత్ అసెంబ్లీని బూతులమయం చేశారని అన్నారు. మూసీ కంపు కంటే సీఎం నోటి నుంచి వచ్చే మాటల కంపు ఎక్కువ అని ఆయన తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కేసీఆర్‌పై సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ సభను ఇష్టం వచ్చినట్లు నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు



