తెలంగాణ
Harish Rao: ఎలక్షన్ల ముందు కోతలు.. అధికారంలోకి వచ్చాక ఎగవేతలు
Harish Rao: రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలైనా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. రుణమాఫీ లిస్టులో పేరున్నా.. బ్యాంకు ఖాతాలో డబ్బులు పడడం లేదన్నారు.