తెలంగాణ

Harish Rao: మంత్రి ఉత్తమ్.. ఉత్త మాటలు మాట్లాడుతున్నారు

Harish Rao: మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తమ్ అన్ని ఉత్త మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. ఉత్తమ్ కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుందని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టు కోసం నేలమీద పడుకొని పనిచేశానని తెలిపారు. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లించామని 90 టీఎంసీలకు 45 టీఎంసీలకు తగ్గించారా లేదా ఉత్తమ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

డీపీఆర్ వాపస్ వచ్చి ఏడాది అయినా మౌనంగా ఎందుకు ఉన్నారని మండిపడ్డారు. తమ హాయాంలో ఏడు అనుమతులు తెచ్చామని రెండేళ్లలో ఒక్క అనుమతి అయినా తెచ్చారా అని నిలదీశారు. పాలమూరు ద్రోహుల్ కాంగ్రెస్ నేతలని గ్రీన్ ట్రిబ్యునల్ లో కోర్టులో కేసు వేసి అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ అని అన్నారు. రెండు టన్నల్స్ బీఆర్ఎస్ హాయాంలోనే పూర్తయ్యాయని మినిస్టర్ ఉత్తమ్ చేతకానితనాన్ని తమపై రుద్దుతున్నారని చిట్ చాట్ లో హరీష్ రావు పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button