తెలంగాణ
Harish Rao: ప్రజలు ఆరోగ్యాలంటే సీఎంకు లెక్క లేదన్న హరీష్

Harish Rao: ప్రజల ఆరోగ్యాలను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు మాజీ మంత్రి హారీష్ రావు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు నిరసన చేశారు. రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా డంపింగ్ యార్డు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నడాని వందల మందిని ఎత్తుకొని పోయి పోలీసు స్టేషన్లలో పెడుతున్నడు అని హరీశ్‌రావు ఆరోపణలు చేశారు.