తెలంగాణ
Harish Rao: కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్తీ

Harish Rao: కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్తీ పట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను సందర్శించారు హరీష్ రావు. కేసీఆర్‌పై కోపంతో కేసీఆర్ కిట్‌లు తీసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు హరీష్ రావు. పేదల ఆరోగ్యంపై రేవంత్‌కు శ్రద్ధ లేదని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ బస్తీ దవాఖానలను నిర్లక్ష్యం చేసిందని ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వడం లేదన్నారు. గ్రీన్ ఛానల్ మాటలకే పరిమితమయిందని విమర్శించారు. ఈహెచ్‌ఎస్ కింద బకాయిలు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. బిల్లులను పెండింగ్ పెట్టడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితి నెలకొందన్నారు.



