తెలంగాణ
Harish Rao: రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదు

Harish Rao: తెలంగాణలో పోలీసులకే రక్షణ లేని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక రౌడీషీటర్ పోలీస్ కానిస్టేబుల్‌ని చంపడం దారుణమన్నారు. స్వయాన ముఖ్యమంత్రే హోం మంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువు అయ్యాయన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.



