తెలంగాణ
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలను మోసం చేసింది

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పనిచేసిందన్నారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ పెంచింది కేసీఆరే అని అన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్‌లోనే తండాలను పంచాయతీలుగా చేసిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్లను కాంగ్రెస్ విస్మరించిందని ఆయన విమర్శించారు. ఎస్టీ బడ్జెట్‌ను ఖర్చు పెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలను మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు



