తెలంగాణ
Harish Rao: విద్యుత్ విధానంపై సీఎం రేవంత్‌కు అవగాహనే లేదు

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ భారం మోపుతోందని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. విద్యుత్ విధానంపై సీఎం రేవంత్‌కు అవగాహనే లేదన్నారు.
విద్యుత్ రంగంలో కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందన్నారు. ఈ విషయం బయటపెట్టినందుకే తనపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. NTPC ఇచ్చే తక్కువ ధర విద్యుత్ కాదని సొంతంగా పవర్ ప్లాంట్లు కడతామని అంటున్నారని ఆయన అన్నారు.



