Harish Rao: ఆరు గ్యారంటీలపై సీఎం రివ్యూ ఎన్నికల డ్రామా

Harish Rao: జూబ్లీహిల్స్ ఓటమి భయంతో సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి, ప్రలోభాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ.. రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా డబ్బులు పంచుతోందని, మద్యం సరఫరా చేస్తోందని , చీరల పంపిణీ చేస్తోందని ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి హరీష్‌రావు బృందం కంప్లైంట్ చేసింది. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన బీఆర్ఎస్ ఆరోపించింది.
జూబ్లిహిల్స్‌లోని సెన్సిటివ్ పోలింగ్ సెంటర్ల దగ్గర సెంట్రల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్ డిమాండ్ చేశారు. యూసుఫ్‌గూడా పోలింగ్ స్టేషన్ పక్కన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్నందున ఎన్నికల బూత్ అక్కడి నుంచి మార్చాలని సీఈవోను బీఆర్ఎస్ కోరింది. ఆరు గ్యారంటీలపై సీఎం రివ్యూ ఓటర్లను మభ్యపెట్టేందుకేనని, రేవంత్ డ్రామాలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సాగవని హరీష్ అన్నారు.



