తెలంగాణ
Harish Rao: మహేష్ గౌడ్ చిల్లర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

Harish Rao: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉండి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని హరీశ్‌రావు ఫైరయ్యారు. ఈటలతో రహస్యంగా సమావేశమయ్యారన్న పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండిస్తున్నామన్నారు.
సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేకనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఆరోపణలు మానుకొని, స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు పై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కు సూచించారు హరీశ్ రావు.