Harish Rao: సిగ్గు లేకుండా కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతున్నారు

Harish Rao: మాగంటి గోపీనాథ్ భార్య సునితమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్ నాయకులు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెస్ వాళ్ళు చనిపోతే భార్యలు ఏడుస్తారా లేదా? అని ప్రశ్నించారు. ఆ తల్లిని పట్టుకుని కాంగ్రెస్ నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఇస్తాం, ఇది ఇస్తాం అని సిగ్గు లేకుండా కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతున్నారన్నారు. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోతమా? అని అన్నారు.
రేవంత్ రెడ్డికి కేసీఆర్ చేసిన అభివృద్ది కనపడటం లేదంటే రేవంత్ పిచ్చాస్పత్రికి వెళ్లాలని సూచించారు. కేసీఆర్‌కు అన్ని మతాలు ఒక్కటేనని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సునీతమ్మకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని కొల్లూరులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.



