సినిమా

‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ సిద్ధం.. ఎన్ని థియేటర్లలో అంటే?

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ జూలై 3న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఏపీలోని పలు థియేటర్లలో ఈ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు ఈ పవర్‌ఫుల్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ జూలై 3న ఉదయం 11:10 గంటలకు విడుదల కానుంది. ఏపీలో 29 థియేటర్లలో ఈ ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ ట్రైలర్ కన్నులపండుగగా ఉంటుందని, రికార్డులను బద్దలు కొట్టనుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థియేటర్లలో ఈ ట్రైలర్‌ను చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button