Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ‘బుక్ మై షో’

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్! ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్‌పై కొత్త అప్‌డేట్ వచ్చింది. వివరాలు చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా, మొదట మే 9న విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా బుక్ మై షో సైట్‌లో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ లీక్ అయ్యింది.
జూన్ 12న ‘హరిహర వీరమల్లు’ బిగ్ స్క్రీన్స్‌పై సందడి చేయనుందని అనధికారిక సమాచారం వెల్లడైంది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.