సినిమా
Gymkhana: ‘జింఖానా’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Gymkhana: ‘ప్రేమలు’ ఫేమ్ నెస్లన్ నటించిన ‘జింఖానా’ థియేటర్లలో మెప్పించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్కు రెడీ అయ్యింది.
‘ప్రేమలు’ సినిమాతో తెలుగు, మళయాళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ హీరో నెస్లన్ మరోసారి తన కామెడీ టైమింగ్తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘జింఖానా’ గత ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలై, కామెడీ బాక్సింగ్ డ్రామాగా మంచి ఆదరణ పొందింది. ఖలీద్ రెహమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫాం సోనీ లివ్ ఈ సినిమాను సొంతం చేసుకుంది. జూన్ 13 నుంచి ‘జింఖానా’ మళయాళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కామెడీ, ఎమోషన్, బాక్సింగ్ డ్రామా అంశాల మిళితంతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకోనుంది.