ప్రారంభమైన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయంలోని పాతకౌన్సిల్‌హాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం 2గంటలకు పోలింగ్ ముగియనుంది. అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్‌బాక్స్‌లను సీల్ వేస్తామన్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఓట్ల లెక్కించి, ఫలితాలను వెల్లడించడం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చి 13 వరకు ఉండే ఈ స్టాండింగ్ కమిటీకి పది మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
దీనికోసం కూటమి తరపున టీడీపీ నుంచి తొమ్మిది మంది, బీజేపీ నుంచి ఒకరు, వైసీపీ నుంచి పది మంది పోటీలో నిలిచారు. కూటమికి 63 మంది, వైసీపీకి 32 మంది సభ్యుల బలం ఉంది. సీపీఐ, సీపీఎంకు ఒక్కొక్కరు చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్తోపాటు సీపీఎం కార్పొరేటర్ గంగారావు ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.



