ఆంధ్ర ప్రదేశ్
నేడు GVMC ప్రత్యేక కౌన్సిల్ సమావేశం

నేడు GVMC ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఇందులో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు సభ్యులు. GVMC మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరు ఖరారు కాగా శ్రీనివాసరావుకు కూటమి సభ్యులు పూర్తి మద్దతు తెలిపారు.
అయితే ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందా అం టూ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉండనుంది. ఉదయం 11గంటలకి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే కౌన్సిల్ భేటీపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.