తెలంగాణ
Gutha Sukender Reddy: ప్రజలు చీదరించుకుంటున్నారు..రాజకీయ నాయకులు భాష మార్చుకోవాలి

Gutha Sukender Reddy: ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని, ప్రతి నాయకుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. నాయకులు మాట్లాడే భాష వింటున్న ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇప్పటికైనా నాయకులు భాష మార్చుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఉచిత పథకాలు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్నారు. ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారుల అవినీతి పెరిగిపొయిందన్నారు. ఎన్నికల ఖర్చుల నియంత్రణ లేకపోవడమే ఈ అవినీతి పెరుగుదలకు ప్రధాన కారణమన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని గుత్తా సుఖేందర్రెడ్డి కోరారు.